ఇకపై జేఈఈ అడ్వాన్స్‌డ్ మూడేళ్లు రాయెచ్చు! 1 m ago
ఇప్పటివరకు ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను వరుసగా రెండు సంవత్సరాలు మాత్రమే రాసే అవకాశం ఉండగా... ఇప్పటి నుంచి మూడేళ్లు రాసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. 2025 జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు 2000 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు అయితే 1995 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత పుట్టిన వారు కూడా ఈ పరీక్షకు హాజరుకావొచ్చు. సిలబస్‌లో ఎటువంటి మార్పు లేదని ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది.